Monday, December 23, 2024

తెచ్చిన వారికే దానిపై విశ్వాసం లేదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానాన్ని తీసుకువచ్చిన వారికే దానిపై విశ్వాసం లేదంటూ కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. గురువారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలను కూడా తప్పుబట్టారు.‘ నిన్న రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మణిపూర్ భారత్‌లో భాగం కాదన్నారు. కానీ ప్రధాని మోడీ ఈశాన్య భారతాన్ని మిగతా ప్రపంచంతో అనుసంధానం చేశారు. ఆయనకు ఈశాన్య భారతంతో సన్నిహిత సంబంధం ఉంది.

భారత్ విడిపోయినట్లుగా చూసే ఐడియాలజీ మీదే తప్ప మాది కాదు’ అని సింధియా అన్నారు. ‘నేను 20 ఏళ్లుగా పార్లమెంటులోఉన్నాను. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు.దేశ అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిని, 140 కోట్ల మంది భారతీయుల హృదయాల్లో కొలువై ఉన్న ప్రధానమంత్రి పట్ల ప్రతిపక్షాలు ఉపయోగించిన పదాలను నేను ఎప్పుడూ వినలేదు. అందుకు ప్రతిపక్షాలు పార్లమెంటు ముందు కాకున్నా ప్రజలముందయినా క్షమాపణ చెప్పాలి’ అని సింధియా అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News