Wednesday, January 22, 2025

కెసిఆర్‌ది బాధ్యతరాహిత్యమైన చర్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం చేపట్టే అనేక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరు కావడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో వరి ధాన్యం కొనేందుకు యాక్షన్ ప్లాన్‌కు సంబంధిత సమావేశం ఏర్పాటు చేస్తే రారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఓపెనింగ్‌కు రారు.. వందే భారత్, సికింద్రాబాద్ స్టేషన్ ఫౌండేషన్‌కు రారు.. ప్రముఖుల జయంతులకు వెళ్లే తీరిక ఉండదు.. కానీ మహారాష్ట్రకు వెళ్లేందుకు తీరిక ఉంటుందని ఆయన అన్నారు. శనివారం జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి కూడా ఆయన వెళ్లరని తెలుస్తున్నది. ఇలాంటి ఘర్షణాత్మక వైఖరి ప్రభుత్వాల మధ్య కొనసాగించడం తెలంగాణకు నష్టం. వాళ్లు ఎన్ని రోజులు అధికారంలో ఉంటే తెలంగాణ అన్ని రోజులు నష్టపోతది. సెక్రటేరియట్ ఒపెనింగ్‌కు గవర్నర్‌ను పిలువని వారు పార్లమెంట్ ఓపెనింగ్‌కు రాష్ట్రపతిని పిలువాలనడం ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News