Monday, December 23, 2024

సింగరేణి పరిస్థితి దయనీయంగా ఉంది: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సింగరేణి పిరిస్థితి దయనీయంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… విశాఖ స్టీల్ ఫ్లాంట్ కొనుగోలు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని ఆరోపించారు. సత్తా ఉన్నందున స్టీల్ ప్లాంట్ కొంటామని గొప్పలు చెబుతూ.. విశాఖ కార్మికుల పాలిట దేవుళ్లమని గొప్పులకు పొతున్నారు. కల్వకుంట్ల కుంటుంబం రాజకీయ జిమ్మిక్కులు చేస్తోందని కిషన్ పేర్కొన్నారు. తెలంగాణలో బొగ్గు గనులు వేలంలో ఎందుకు పాల్గొనట్లేదని ఆయన ప్రశ్నించారు. టెండర్లు కూడా వేయకుండా బాధ్యత విస్మరిస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి ఎన్నికల దృష్ట్యా కొత్త పల్లవి అందుకున్నారని ఫైర్ అయ్యారు. ప్రధానికి వ్యతిరేకంగా దీక్షలు చేయాలని పిలుపునిచ్చారని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News