Wednesday, January 22, 2025

దేశాన్ని ఎందుకు అవమానిస్తారు? : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాజకీయంగా బిజెపిని విమర్శించండి కానీ దేశాన్ని ఎందుకు అవమానిస్తున్నారని కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఖమ్మంలో జరిగిన బిఆర్‌ఎస్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పలువురు ప్రముఖలు సంధించిన విమర్శలపై కిషన్ రెడ్డి స్పందించారు. విపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు భాధ్యతయుతమైన హోదాలో ఉంటూ దేశాన్ని ఎందుకు నిందిస్తున్నారని నిలదీశారు.

దేశాన్ని చైనా, పాకిస్థాన్‌లతో పోల్చుతూ విమర్శించడం తగదన్నారు. సైనికులను అవమానించడం కొందరు ముఖ్యమంత్రులకు అలవాటుగా మారిందని అన్నారు. దేశంలోని గ్రామాల అభివృద్ధి కేంద్రం ఇస్తున్న నిధులతోనే జరుగుతుందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News