Tuesday, January 21, 2025

సర్కారు బడుల అభివృద్ధికి సమాజమంతా బాధ్యత తీసుకోవాలి: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెరుగైన ఫర్నిచర్, ల్యాబ్స్‌పై ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. విద్యానగర్ జామై ఉస్మానియా పాఠశాలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బెంచీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు పెరగాలన్నారు. సర్కారు బడుల అభివృద్ధికి సమాజమంతా బాధ్యత తీసుకోవాలని సూచించారు.
కర్నాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యం కనిపిస్తోందన్నారు దివాళకోరు, దగాకోరు రాజకీయాలు చేయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందన్నారు. అమలు కానీ హామీలు ఇవ్వడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని కిషన్ రెడ్డి చురకలంటించారు. ఇచ్చిన హామీలకే గతిలేదని, కొత్తగా మళ్లీ హామీలిస్తున్నారన్నారు. కర్నాటకలో హామీలు అమలు చేయలేక చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అనేక వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారులోకి వచ్చిందని దుయ్యబట్టారు. డిక్లరేషన్, గ్యారంటీల పేరుతో గారడీ చేశారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News