Thursday, January 23, 2025

అక్రమాలకు తెలంగాణ బంగారు గని బలైపోతోంది: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మిగులు నిధులున్న.. తెలంగాణ బంగారు గని సింగరేణిని.. అప్పుల ఊబిలోకి బిఆర్‌ఎస్ ప్రభుత్వం నెట్టేసిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఢిల్లీలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల కష్టార్జితంతో కొనసాగుతున్న సింగరేణి సంస్థను నష్టం చేసేలా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బిఆర్‌ఎస్ నేతల అక్రమాలకు తెలంగాణ బంగారు గని బలైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు గనుల వేలంలో పాల్గొనలేని రాష్ట్ర ప్రభుత్వం.. సింగరేణి సొమ్మును విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడులు పెడతామని చూస్తే కార్మికులు సహించబోరని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణిని సాధించు, రక్షించు అనే నినాదాన్ని కెసిఆర్ తీసుకున్నారు. కానీ, ఈ రోజు భక్షించే విధానాన్ని అమలు చేస్తున్నారు.

2014లో రూ.3.500 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ సింగరేణి కొనసాగేది. ప్రస్తుతం సింగరేణి చెల్లించాల్సిన బకాయిలు రూ. 10వేల కోట్లు దాటింది. బిఆర్‌ఎస్ చేతకాని తనంతో సింగరేణి అప్పులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. సంస్థలో బిఆర్‌ఎస్ నేతల జోక్యం విపరీతంగా పెరిగిపోయింది. తెలంగాణలో బొగ్గు గనుల వేలంలో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనట్లేదు. టెండర్లు కూడా వేయకుండా తమ బాధ్యతను విస్మరించారు‘ అని కిషన్‌రెడ్డి ఆరోపించారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వం వాటా 49 శాతం ఉన్నప్పటికీ.. 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే పరిపాలన ఉంటుందని పేర్కొన్నారు. సింగరేణిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News