Friday, December 20, 2024

ఆర్ట్స్ కళాశాలను సందర్శించిన కేంద్ర మంత్రి

- Advertisement -
- Advertisement -

హన్మకొండ :- ఈ నెల 8న వరంగల్ పర్యటన కు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాజీపేటలో వ్యాగన్ పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన, అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించి బహిరంగ సభకు స్థల పరిశీలన కోసం కళాశాలకు వచ్చిన కేంద్ర పర్యటన శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ఆదివారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయానికి రావడం జరిగింది.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొపెసర్ బన్న ఐలయ్య, కళాశాల వైస్ ప్రిన్సిపల్ ప్రొపెసర్ హనుమంతు కేంద్రమంత్రికి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రిన్సిపల్ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శకుల పుస్తకంలో కళాశాలపై తన అభిప్రాయాన్ని రాసి సంతకం చేశారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బన్న ఐలయ్య కళాశాల యొక్క చారిత్రక ఉన్నతిని తెలియజేశారు. ముఖ్యంగా కళాశాలకు వంద సంవత్సరాలు చరిత్ర ఉందని ఇందులో చదువుకున్న గొప్ప వారిలో భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పీవీ నరసింహారావు అని, అంతేకాక ఎంతో మంది రాజకీయ నాయకులు, పరిపాలకులు ఈ కళాశాల పూర్వ విద్యార్థులు ఉన్నారన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కళాశాలకు ఎంతో చారిత్రక పేరు ఉందని 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన కళాశాలకు రావడం ఆనందంగా ఉందన్నారు. వరంగల్ ఆర్ట్స్ కళాశాల పేరు తెలియని వారు ఉండరన్నారు. కళాశాలకు వచ్చిన వారిలో బిజెపి హనుమకొండ అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, ప్రేమేందర్ రెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డి తదితరులు కళాశాలకు వచ్చిన వారిలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News