Sunday, December 22, 2024

కిషన్ రెడ్డికి అధిష్టానం పిలుపు.. ఆ స్థానాల్లో అభ్యర్థుల ఖరారు?

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో శనివారం మధ్యాహ్నం కిషన్ రెడ్డి ఢిల్లీకి పయనం కానున్నారు. కిషన్ రెడ్డితో పాటు బిజెపి సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో మిగిలిన 8 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులు, పార్టీలో చేరికలపై అధిష్టానం ఆయనతో చర్చించనుంది. ఆదివారం ఢిల్లీలో బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. అభ్యర్థులను ఖరారు చేయనున్న నేపథ్యంలోనే కిషన్ రెడ్డికి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News