Sunday, December 22, 2024

కేంద్ర మంత్రి కుమారస్వామికి తీవ్ర అస్వస్థత

- Advertisement -
- Advertisement -

కేంద్ర ఉక్కుశాఖమంత్రి, జేడీ (ఎస్) నేత హెచ్.డి కుమారస్వామి ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బెంగళూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతుండగా, ముక్కు నుంచి రక్తం విపరీతంగా కారడం ప్రారంభమైంది. ఆయన చొక్కా మొత్తం తడిసి పోయింది. విలేకర్లు ఈ విషయాన్నిగమనించి కేంద్ర మంత్రి రిజ్జుకు తెలియజేశారు. కుమారస్వామిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు.

ముడా కుంభకోణంపై పోరాటానికి సంబంధించిన కార్యాచరణపై ఆదివారం, బీజేపీ, జేడిఎస్ నేతల సమావేశంలో మాట్లాడుతుండగా అస్వస్థతకు గురయ్యారు. ఈ సమావేశంలో మాజీ సిఎం బిఎస్ యడ్యూరప్ప, కుమారస్వామి నిఖిల్ గౌడ తదితరులు హాజరయ్యారు. కుమారస్వామికి గతంలో రెండుసార్లు గుండెపోటు వచ్చింది. ఈ ఏడాది మార్చిలో చెన్నై లోని అపోలో ఆస్పత్రిలో ట్రాన్స్‌కేథటర్ అరోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News