Monday, December 23, 2024

రామ మందిరాన్ని ఆశీర్వదించండి.. విమర్శలు కావు

- Advertisement -
- Advertisement -

పాల్ఘర్ : శంకరాచార్యులు రామ మందిరానికి ఆశీస్సులు అందజేయాలని, కొన్ని అంశాలపై విమర్శించడం తగదని కేంద్ర మంత్రి నారాయణ్ రాణె శనివారం హితవు పలికారు. వారు ‘రాజకీయ దృక్కోణం’ నుంచి ప్రధాని నరేంద్ర మోడీని చూస్తున్నారని రాణె ఆరోపించారు. రాణె పాల్ఘర్‌లో విలేకరులతో మాట్లాడుతూ, సమాజానికి, హిందుత్వానికి తాము చేసిన సేవలు ఏమిటో శంకరాచార్యులు స్పష్టం చేయాలని కోరారు.

‘వారు ఆలయాన్ని ఆశీర్వదించాలా లేక విమర్శించాలా ? అంటే వారు రాజకీయ కోణంలో నుంచి ప్రధాని నరేంద్ర మోడీని పరికిస్తున్నట్లు అర్థం అవుతోంది. రాజకీయాల ప్రాతిపదికపై కాకుండా మతం ఆధారంగా ఆలయ నిర్మాణం జరిగింది. రాముడు మన దేవుడు’ అని రాణె చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రామ మ ందిరాన్ని ప్రారంభించాలన్న శివసేన (యుబిటి) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాకరే సలహా గురించిన ప్రశ్నకు రాణె సమాధానం ఇస్తూ, ఏ పదవీ లేకుండా ఇంటిలో కూర్చునే వ్యక్తిపై తాను వాఖ్యానించబోనని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News