Monday, January 20, 2025

కేంద్ర మంత్రి పశుపతి పారస్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పశుపతి పారస్ మంగళవారం తన పదవికి రాజీనామా చేయడంతోపాటు బిజెపి సారథ్యంలోని ఎన్డిఎ నుంచి తన రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ(ఆర్‌ఎల్‌జెపి)ని ఉపసంహరించుకున్నారు. తన అన్న రాంవిలాస్ విశ్వాన్ కుమారుడైన చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జెపి)తో బీహార్‌లో బిజెపి లోక్‌సభ ఎన్నికల కోసం సీట్ల పొత్తు కుదుర్చుకున్న దరిమిలా ఈ పరిణామం చోటుచేసుకుంది. పారస్ పార్టీని పూర్తిగా విస్మరించిన బిజెపి చిరాగ్ పాశ్వాన్ పార్టీతో సీట్ల పొత్తు పెట్టుకుంది. చిరాగ్ పాశ్వాన్ ఎల్‌జెపికి ఐదు సీట్లను బిజెపి కేటాయించింది. అందులో 2019 లోక్‌సభ ఎన్నికల్లో పారస్ గెలుపొందిన హాజీపూర్ కూడా ఉంది.

ప్రధాని మోడీకి ధన్యవాదాలని, తనకు, తన పార్టీకిఎన్‌డిఎలో తీరని అన్యాయం జరిగిందని, అందుకే తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని పారస్ తెలిపారు. అయితే తన భవిష్యత్ కార్యాచరణ గురించి ఆయన వెల్లడించలేదు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్-ఆర్‌జెడి కూటమిలో చేరతారా లేక జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో చేరతారా అన్న విషయం తెలియాల్సి ఉంది. అయితే హాజీపూర్ స్థానం నుంచి తాను పోటీ చేసానని ఆయన స్పష్టం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో అవిభక్త లోక్ జనశక్తి పార్టీ తరఫున హాజీపూర్ నుంచి పోటీ చేసి పారస్ గెలుపొందారు. ఆ స్థానంలో ఆయన సోదరుడు, 2020 అక్టోబర్‌లో మరణించిన రాం విలాస్ పాశ్వాన్ 8 సార్లు గెలుపొందారు. ఈ స్థానంలో బిజెపి ఇప్పటివరకు గెలుపొందక పోవడం విశేషం. బీహార్‌లో పాశ్వాన్లకు 6 శాతం ఓటు బ్యాంకు ఉంది. తన తండ్రికి రాజకీయ వారసుడిగా తమ సామాజిక వర్గం ఓట్లపై తనకు పూర్తి స్థాయి పట్టు ఉందని చెబుతున్న చిరాగ్ పాశ్వాన్‌తోనే బీహార్‌లో ఎన్నికల్లో వెళ్లాలని బిజెపి నిర్ణయించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News