Monday, April 14, 2025

కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు: కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై కేంద్రమంత్రితో అరగంట చర్చించామని కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డివెంకటరెడ్డి తెలిపారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ప్రభుత్వం తరపున వినతి పత్రాలు అందజేశామని అన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… తాము నివేదించిన అంశాలపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. వరంగల్ రింగ్ రోడ్డు ఇస్తామన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాజీపేట డివిజన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. పెండింగ్ లో ఉన్న వికారాబాద్ రైల్వే లైన్ పై కూడా స్పష్టత ఇవ్వాలని కోరారు. డోర్నకల్- భద్రాచలం రైల్వే లైన్ ఉందని.. వంతెన పూర్తి కాలేదని, దీనిపై కేంద్రం చొరువ తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి విన్నవించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News