Friday, December 20, 2024

మణిపూర్‌ పై చర్చకు ప్రభుత్వం సిద్ధమే : పీయూష్ గోయల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మణిపూర్ సంఘటనపై పార్లమెంట్‌లో చర్చకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని, కానీ విపక్షం పార్లమెంట్ సమావేశాలు జరగనీయకూడదన్న ఆలోచనతో అంతరాయం కలిగిస్తున్నట్టు స్పష్టమౌతోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గురువారం ఆరోపించారు. మణిపూర్ పరిస్థితి, విద్వేషంపై చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తుండగా సమావేశాలు ఒక రోజు వాయిదా పడ్డాయి. పార్లమెంట్ బయట కూడా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ , సమాజ్‌వాదీ పార్టీలు , మణిపూర్ హింసపై , మే 4 నాటి వీడియోపై కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డాయి. ఈ సందర్భంగా పార్లమెంట్ కాంప్లెక్సులో విలేఖరులతో గోయల్ మాట్లాడారు. మణిపూర్‌పై చర్చకు ప్రభుత్వం సిద్ధమైనా విపక్షాలు రావడం లేదని, మణిపూర్‌పై చర్చవస్తే పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్,

రాజస్థాన్ రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు, మహిళలపై జరిగిన అఘాయిత్యాలు కూడా చర్చించ వలసి వస్తుందని విపక్షాలు భయపడుతున్నాయని గోయల్ తిప్పి కొట్టారు. రాజ్యసభలో మణిపూర్‌పై స్వల్పకాల వ్యవధిలో చర్చకు ఛైర్మన్ నోటీస్‌లను అనుమతించినా, కాంగ్రెస్ అధ్యక్షుడు , ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే అభ్యంతరాలు లేవనెత్తారు. సభలో మిగతా చర్చలన్నీ రద్దు చేసి రూల్ 267 కింద మణిపూర్‌పై చర్చించాలని డిమాండ్ చేశారు. అయితే చాలా మంది విపక్షాల సభ్యులు రూల్ 176 కింద స్వల్ప వ్యవధిలో చర్చకు నోటీస్ ఇచ్చారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. అయితే తాము చర్చకు అంగీకరించబోమని వారు అనుకున్నారని, కానీ తాము చర్చలకు అంగీకరించామని, అయినా వారు సమావేశాలు జరగనీయకూడదన్న ఉద్దేశంతోఉన్నట్టు కనిపిస్తోందని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News