జెడి (ఎస్) మాజీ ఎంఎల్‌ఎ భార్య దాఖలు చేసిన వంచన ఫిర్యాదు ఆధారంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోదరుని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గోపాల్ జోషిపైన, విజయలక్ష్మి జోషి అనే మహిళపైన బసవేశ్వరనగర్ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. గోపాల్ కుమారుడు అజయ్ జోషి పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. మాజీ నాగ్థన్ ఎంఎల్‌ఎ దేవవంద్ ఫూల్ సింగ్ చవాన్ భార్య సునీత చవాన్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. మే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి తన కుటుంబానికి బిజెపి టిక్కెట్ సాధిస్తాననే నెపంతో రూ. 2 కోట్ల మేరకు గోపాల్ జోషి తనను వంచించారని ఆమె ఆరోపించారు.
విజయలక్ష్మిని ప్రహ్లాద్ జోషి చెల్లెలుగా తనకు పరిచయం చేశారని కూడా ఫిర్యాదీ ఆరోపించారు. అయితే. కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తనకు సోదరీమణులు ఎవ్వరూ లేరని స్పష్టం చేశారు. తను ముగ్గురు సోదరులు మాత్రమే ఉన్నారని, వారిలో ఒకరు 1984లో మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లో ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారని ఆయన తెలియజేశారు. తాను మూడు దశాబ్దాల క్రితమే తన సోదరుని (గోపాల్ జోషి)తో సంబంధం తెంచుకున్నానని మంత్రి ఇదివరకే స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగా, స్పాట్ దర్యాప్తు కోసం గోపాల్ జోషిని దర్యాప్తు పోలీసుల బృందం హుబ్బళ్లిలోని ఆయన ఇందిరా కాలనీ నివాసానికి తీసుకువచ్చారు.