- Advertisement -
యంగ్ గ్లోబల్ లీడర్‌గా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఎన్నికయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ యంగ్ లీడర్ జాబితాలో కేంద్రమంత్రి రామ్మోహన్ చోటు దక్కించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ రంగాలలో ఉత్తమ నాయకత్వం కనబరిచిన యువ నాయకులకు గుర్తింపుగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం జాబితా ప్రకటించింది. భారతదేశం నుంచి ఏడుగురిని ఎంపిక చేసింది.
కాగా, యంగ్ గ్లోబల్ లీడర్‌గా ఎంపికైన రామ్మోహన్‌కు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఇది దేశానికి ప్రతిష్ఠాత్మక గుర్తింపు అని, ముఖ్యంగా తెలుగువారికి గర్వకారణమని సిఎం చంద్రబాబు అన్నారు. ప్రజాసేవలో రామ్మోహన్ అంకితభావం.. యువతకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. దీనిపై స్పందించిన మంత్ర నారా లోకేశ్.. యంగ్ గ్లోబల్ లీడర్‌గా రామ్మోహన్ ఎంపిక కావటం ఏపీ, భారత్‌కు గర్వకారణమని పేర్కొన్నారు.
- Advertisement -