న్యూస్ డెస్క్: మహిళా రెజ్లర్ల నిరసనలపై విలేరి ప్రశ్నకు కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి పరుగులు పెట్టారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా నిరసన కొనసాగిస్తున్న మహిళా రెజ్లర్ల నిరసన గురించి ఒక విలేకరి మంగళవారం కేంద్ర మంత్రి మీనాక్షి లేఖిని ప్రశ్నించగా ఆమె సమాధానం ఇవ్వకుండా పరుగులు పెడుతూ అక్కడ నుంచి వెళ్లిపోవడం వీడియోలో కనిపించింది.
ఆ విలేకరి పదేపదే ప్రశ్నించినప్పటికీ కేంద్ర మంత్రి మాత్రం చలో చలో అంటూ ఆమె పరుగులాంటి నడకతో వెళ్లిపోయారు. రెజ్లర్ల నిరసనలపై ఎటువంటి ప్రశ్నలకు జవాబు ఇవ్వకూడదని మీనాక్షి లేఖి నిర్ణయించుకున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది.
సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన ఈ వీడియోపై కాంగ్రెస్‌తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తీవ్రంగా విమర్శలు గుప్పించాయి. సిగ్గుమాలిన మంత్రి అంటూ ఆప్ తీవ్ర పదజాలంతో విమర్శించింది. మంత్రిపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ కూడా తీవ్రంగా విమర్శించారు.
महिला पहलवानों के मुद्दे पर केंद्रीय मंत्री मीनाक्षी लेखी ने दी तीखी प्रतिक्रिया
आप खुद देखें 👇 pic.twitter.com/9XqyJcwmgD
— Congress (@INCIndia) May 30, 2023