- Advertisement -
బాలాసోర్: ఒడిశా బాలాసోర్ జిల్లాలోని నీలగిరి ప్రాంతంలో ఆదివారం కేంద్ర మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. కేంద్రమంత్రి కారును ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. మంత్రి సారంగితో పాటు తన పిఎ, డ్రైవర్, పిఎస్‌ఓ గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్ మాలియాని నుండి వస్తూ అదుపుతప్పడంతోనే మంత్రి కారును ఢీకొట్టినట్టు పోలీసులు తెలిపారు. ఒక కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Union Minister sarangi injured in road accident
- Advertisement -