Friday, November 22, 2024

కేంద్ర మంత్రికి లష్కర్- ఇ-తాయిబా బెదిరింపు లేఖ

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : కేంద్ర మంత్రి, బీజేపీ నేత శంతను ఠాకూర్‌కు ఉగ్రవాద సంస్థ లష్కర్ ఇ- తాయిబా నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. పౌరుల జాతీయ నమోదు ( ఎన్‌ఆర్‌సి)ను పశ్చిమబెంగాల్‌లో అమలు చేస్తే తాము మొత్తం దేశాన్ని దగ్ధం చేస్తాం అని బెదిరిస్తూ లేఖ వచ్చింది. ఈ లేఖ బెంగాలీ భాషలో టైప్ చేసి ఉంది. ఎన్‌ఆర్‌సిని అమలు చేయడం ద్వారా ముస్లింలు హింసకు గురైతే మతువా సమాజంచే ఠాకూర్‌బారి ఉద్యమం లేవదీస్తామని లేఖలో హెచ్చరించి ఉంది.

“ ఈ లేఖ చూసి షాకయ్యాను. నా విభాగానికి తెలియజేశాను, అలాగే ప్రధాని నరేంద్రమోడీకి , హోం మంత్రిత్వశాఖకు, కూడా తెలియజేశాను. దీనిపై కేసు నమోదు చేశారు ” అని మంత్రి తెలిపారు. శంతను ఠాకూర కేంద్ర రేవులు, నౌకా, జలమార్గాల సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. ఉగ్రవాద సంస్థ అయిన లష్కర్ ఇ తాయిబా లేఖ గురించి ఏదైనా సమాచారం అందిందా అని రాష్ట్రముఖ్యమంత్రి మమతాబెనర్జీని అడిగినట్టు కేంద్ర మంత్రి చెప్పారు. పశ్చిమబెంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన ఎల్‌ఇటి సభ్యులు ఈ లేఖ పంపినట్టు లేఖపై ఉన్న సంతకాల బట్టి తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News