Sunday, January 19, 2025

మణిపూర్‌లో కేంద్ర మంత్రి ఇంటికి నిప్పు

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: మణిపూర్‌లో కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ఆర్‌కె రంజన్ సింగ్ ఇంటికి గురువారం రాత్రి మూకలు నిప్పుపెట్టాయి. చురాచంద్‌పూర్ జిల్లాలో ఒక గ్రామంపై మూకలు దాడి జరపడంతో పలువురు గ్రామస్తులు గాయపడ్డారు.
ఇంఫాల్‌లోని కొంగ్‌బా ప్రాంతంలో ఉన్న కేంద్ర మంత్రి సింగ్ ఇల్లు మంటలకు పాక్షికంగా ధ్వంసంకాగా ఇంటి ఆవరణలో నిర్మించిన తాత్కాలిక షెడ్లు పూర్తిగా కాలిపోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మూకలు దాడి జరిపిన సమయంలో కేంద్ర మత్రి, ఆయన కుటుంబం మణిపూర్‌లో లేరని వారు చెప్పారు. అధికార పనుల నిమిత్తం ఆయన ప్రస్తుతం కేరళలో ఉన్నట్లు టివి చాలళ్లు తెలిపాయి. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు వర్గాలు తెలిపాయి.

ఇంఫాల్ తూర్పులో మణిపూర్ ఏకైక మహిళా మంత్రి నెంచా కిప్‌జెన్ ఇంటిపై మూకల దాడి జరిగిన మరుసటి రోజే కేంద్ర మంత్రి ఇంటిపై దాడి జరగడం గమనార్హం. మణిపూర్‌లో మే 3న హింసాకాండ రాజుకున్న నాటి నుంచి ఇప్పటి వరకు కనీసం 8 మంది ఎమ్మెల్యేలు, మంత్రులపై దాడులు జరిగాయి. మే 25న కేంద్ర మంత్రి రంజన్ సింగ్ ఇంటిపై మూకలు దాడి చేసి ఇంటిని ధ్వంసం చేసినట్లు వర్గాలు తెలిపాయి.

మంగళవారం రాత్రి కంగ్‌పోక్‌పీ జిల్లాలో హత్యలకు బాధులైన వారిని కఠినంగా శిక్షిస్తామని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే కేంద్ర మంత్రి ఇంటికి మూకలు నిప్పుపెట్టాయి. ఇది ప్రభుత్వానికి, మణిపూర్‌లోకి అక్రమంగా చొరబడిన వారికి మధ్య పోరాటమని, రెండు కులాల మధ్య(మీటీ, కుకీ) ఘర్షణ కాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అన్ని వర్గాలవారు శాంతిని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి దాడిలో మీటీకి చెందిన 9 మంది మరణించగా మరో 10 మంది గాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News