Monday, December 23, 2024

మంత్రుల బృందం, రైతు నేతల చర్చలు

- Advertisement -
- Advertisement -

చండీగఢ్ : రైతు నేతలు, కేంద్ర మంత్రుల బృందం నడుమ ఆదివారం రాత్రి తిరిగి చర్చలు ఆరంభమయ్యాయి. తమ డిమాండ్ల సాధనకు పంజాబ్ రైతులు ఢిల్లీ చలో యాత్ర తలపెట్టడం ప్రతిష్టంభనకు దారితీసింది. సమస్య పరిష్కారానికి ఇరుపక్షాల నడుమ ఇప్పుడు నాలుగో దఫా సంప్రదింపులు సాగాయి. కేంద్రం తరఫున వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా, ఇతర మంత్రులు పియూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ బృందంగా వచ్చారు. ఇక్కడి మహాత్మా గాంధీ స్టేట్ ఇనిస్టూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎంజిసిపా) భవనంలో సంప్రదింపులకు పంజాబ్ సిఎం భగవంత్ మాన్ కూడా హాజరయ్యారు. శంభూ సరిహద్దులలో ప్రదర్శన దశలో గాయపడి మృతి చెందిన గియాన్ సింగ్‌కు నివాళి తరువాత రైతుల నేతలు చర్చవేదికకు తరలివచ్చారు.

పంజాబ్ సిఎంతో పాటు రాష్ట్ర వ్యవసాయ మంత్రి గుర్మీత్ సింగ్ ఖుదియన్ కూడా ఉన్నారు. అంతకు ముందు కేంద్ర మంత్రులు తమలో తాము రైతుల డిమాండ్లు సాధ్యాసాధ్యాలపై చర్చించారు. అయితే డిమాండ్ల సాధనకు రైతుల నేతలు పట్టుదలతో ఉన్నట్లు వెల్లడైంది. ప్రధాని మోడీ ముందుగా స్పందించాలని లేకపోతే మంత్రుల స్థాయిబృందంతో చర్చలు ఏ మేరకు ఫలితం ఇస్తాయని రైతులు ప్రశ్నించారు. రైతుల తరఫున నేతలు జగ్జిత్ సింగ్ దాలేవాల్, సర్వాన్ సింగ్ పంథేర్, సుర్జిత్ సింగ్ ఫూల్, జస్వీందర్ సింగ్ లోంగోవాల్, సత్నామ్ సింగ్, అమర్జిత్ సింగ్ మెహ్రీ ఇతరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News