Thursday, January 23, 2025

పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ అభివృద్ధ్దిని కేంద్ర మంత్రులు పొగిడారు

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల: పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ అభివృద్ధ్దిని కేంద్ర మంత్రులు పొగిడారని, రాజకీయ ప్రత్యర్థి పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణను పొగడక తప్పలేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్‌కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజైన గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అమర వీరుల స్థూపం వద్ద రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్‌కుమార్, శాసన సభ్యులు రసమయి బాలకిషన్, జడ్‌పి సిపి అరుణ, ఎంసిపి జిందం కళచక్రపాణి, కలెక్టర్ అనురాగ్ జయంతి,ఎస్‌పి అఖిల్ మహజన్ తదితరులు పుష్పగుచ్ఛాలు ఉంచి, పూలు చల్లుతూ రెండు నిమి షాలు మౌనం పాటించి అమర వీరులకు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయి నిపల్లి వినోద్‌కుమార్ మాట్లాడారు. ఇటీవలే తెలంగాణ సెక్రెటేరియట్‌కు డా. బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకుని దాన్ని సిఎం కెసిఆర్ ఆవిష్కరించారని, దాని ఎదురుగానే ఈ రోజు( గురువారం) సాయంత్రం హైదరాబాద్ నడిబొడ్డున సిఎం కెసిఆర్ అమర వీరుల స్థూపాన్ని ఆవిష్కరిస్తున్నారన్నారు.

యావత్తు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ కల సాకార మైందన్నారు. తె లంగాణలో అమరుల ఆశయాల సాధనకు సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం సిఎం కెసిఆర్ తొమ్మిదేళ్లుగా కృషి సాగిస్తున్నారన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మరో దశాబ్దానికి అవరసమైన ప్రణా ళికలను రచించుకుంటూ ముందుకు సాగుదామని అన్నారు.త్యాగాలను గుర్తుకు తెచ్చుకుని నివాళులు అర్పించారు.

శాసన సభ్యులు రసమయి బాలకిషన్ మాట్లాడుతూ అమరుల త్యాగాలు గొప్పగా ప్రతిఫలాలు గొప్పగా విస్తరిస్తూ అభివృధ్దిని సాధిస్తూ యా వత్తు దేశం తెలంగాణ వైపు చూసేలా అమరులను గౌరవించుకుంటూ సిఎం కెసిఆర్ పాలన సాగిస్తున్నారన్నారు. ఈరోజు సిఎం కెసిఆర్ హైదరాబాద్‌లో అమరవీరుల స్మారక జ్యోతిని ప్రారంభిస్తురన్నారు

ఈ కార్యక్రమంలో సెస్ చైర్మన్ చిక్కాల రామా రావు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడు ఆకునూరి శంకరయ్య, మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య, బిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News