Sunday, December 29, 2024

ప్రభాస్‌ను కలవనున్న కేంద్రమంత్రులు

- Advertisement -
- Advertisement -

Union Ministers Rajnath Singh and Amit Shah will meet Prabhas

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ నెల 16న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఇటీవల మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. అనంతరం సోమాజిగూడలోని కత్రియా హోటల్‌లో నిర్వహించే కృష్ణంరాజు సంతాప సభలో పాల్గొంటారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం రాజ్‌నాథ్‌సింగ్ తిరిగి దిల్లీకి పయనం కానున్నారు. మరోవైపు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సైతం ప్రభాస్‌ను పరామర్శించనున్నారు. ఈ నెల 17న ఉదయం 7:30 గంటలకు పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే విమోచన దినోత్సవ వేడుకల్లో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం బిజెపి జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పదాధికారులు ఇతర ముఖ్యనేతలతో అమిత్ షా భేటీ అవుతారు. అయితే ఈ భేటీల అనంతరం అమిత్‌షా ప్రభాస్‌ను కలుస్తారా లేక 16 తేదీనే రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిసి పరామర్శిస్తారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News