Monday, January 20, 2025

నేడు, రేపు కేంద్ర మంత్రుల పర్యటన : బిజెపి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : శాసనసభ ఎన్నికలలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించి విస్తృత ప్రచారంలో పాల్గొననున్నారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. 15వ (నేడు) తేదీన కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ముషీరాబాద్ పర్యటనలో భాగంగా మత్స్యకారులతో సమావేశంలో పాల్గొంటారని, అనంతరం అంబర్ పేటలో మత్స్యకారులతో సమావేశంలోనూ పాల్గొంటారని ఆయన వెల్లడించారు.

16వ తేదీన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో జరగనున్న బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అదే విధంగా 16వ తేదీన కేంద్ర మత్స్య, పాడి పరిశ్రమ, పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్ మండల బిజెపి కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం కల్వకుర్తిలో జరగనున్న బిజెపి బహిరంగ సభలో పాల్గొంటారని ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News