Monday, December 23, 2024

రూ. పది లక్షల వరకూ పంపించవచ్చు

- Advertisement -
- Advertisement -

Union Ministry of Home Affairs amends FCRA rules

న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రిత్వశాఖ విదేశాల నుంచి ఇక్కడి వారికి అందే నగదు విషయంలో అమలులో ఉన్న ఎఫ్‌సిఆర్‌ఎ చట్టంలోని కొన్ని నిబంధనలను సవరించింది. దీని మేరకు భారతీయులు విదేశాలలోని తమ బంధువుల నుంచి ఏటా రూ 10 లక్షల వరకూ స్వీకరించవచ్చు. ఈ పరిమితి మేరకు అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు ఈ పరిమితి కేవలం 1 లక్ష రూపాయల వరకూ ఉంది. హోం మంత్రిత్వశాఖ ఈ ఎఫ్‌సిఆర్‌ఎ సవరణల నోటిఫికేషన్‌ను వెలువరించింది. పది లక్షల పరిమితి దాటి ఎక్కువ మొత్తంలో తమ వారి నుంచి సొమ్ము పొందినట్లు అయితే దీనికి సంబంధించి అధికారులకు దీని గురించి 90 రోజులలో తెలియచేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ ఉన్న నిబంధన ప్రకారం ఈ గడువు కేవలం 30 రోజుల వరకే ఉంది. ఇక ఎన్‌జిఒ లేదా ఏ వ్యక్తి అయినా విదేశాల నుంచి నిధులు పొందితే దానికి సంబంధించి ప్రతి నాలుగు నెలలకోసారి తెలియచేయాల్సి ఉంటుంది.సంస్థల బ్యాంకు ఖాతాల నెంబర్లు లేదా పేర్లు చిరునామాలు మారితే 45 రోజులలో ఈ వివరాలను అధికారులకు తెలియచేయాలి. ఇప్పటివరకూ ఈ గడువు కేవలం పక్షం రోజుల వరకే ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News