Monday, December 23, 2024

పాత పెన్షన్ పునరుద్ధరించాలని ఎమ్మెల్సీ కవితకు ఉద్యోగ సంఘాల వినతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితను ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ ,కోశాధికారి నరేష్ గౌడ్‌లు కలిసి ‘సిపిఎస్ విధానం రద్దు, పాత పెన్షన్ అమలుపై’ సమగ్ర సమాచారంతో కూడిన సంపుటిని కవితకు అందచేశారు. ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ పుట్టినరోజు ఉన్న సందర్భంగా కవిత ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత సిపిఎస్ విధానంపై స్థితప్రజ్ఞను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా పాత పెన్షన్ పునరుద్ధరించిన రాష్ట్రాల్లో అమలు తీరుతెన్నులు, ఆ రాష్ట్రాలకు సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లపై సవివరమైన వివరాలను స్థితప్రజ్ఞ ఎమ్మెల్సీ కవితకు అందచేశారు. అదేవిధంగా రాష్ట్రాలకు ఎన్‌పిఎస్ ట్రస్ట్ నుంచి రావాల్సిన పెన్షన్ నిధి ఏవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ అడ్డువేస్తుందో కవిత ఉద్యగో సంఘాల నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సిపిఎస్ విధానంతో రాష్ట్రంలో రెండు లక్షల కుటుంబాల సామాజిక భద్రత షేర్ మార్కెట్ పాలు అవుతుందని ఉద్యోగ సంఘాల నాయకులు కవిత దృష్టికి తీసుకొచ్చారు. కవితను కలిసిన వారిలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రావు, రాష్ట్ర నాయకులు నటరాజ్ చరక, హాజిలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News