Monday, January 20, 2025

కేంద్రానికి వ్యతిరేకంగా సంఘంటితంగా ఉద్యమిద్దాం: కె.కవిత

- Advertisement -
- Advertisement -

Kavitha speaks about appreciation bill in legislative council

మన తెలంగాణ/సిటీ బ్యూరో: మాటలతో, చేతలతో తెలంగాణను నట్టేట ముంచుతున్న కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలకు వ్యతిరేకంగా సంఘంటితంగా ఉద్యమిద్దామంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజలకు పిలుపునిచ్చారు. టిఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు పెంచిన పెట్రో, డీజల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి కార్యాలయం వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కవిత, పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవితతో పాటు మంత్రులు కట్టెల పొయ్యి మీద వంట చేసి నిరసన తెలిపారు. పెంచిన పెట్రో ఉత్పత్తుల ధరలను వెంటనే తగించాలంటూ టిఆర్‌ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. బిజెపికో హటావో – దేశ్‌కో బచావో అంటూ నినధించారు.

ధర్ననుద్దేశించి కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత 8 ఏళ్ల కాలంలో ఎప్పడు రోడేక్కని ప్రజలు కేంద్ర ప్రభుత్వం కారణంగా మండుటెండల్లో ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. మన జిడిపిని పెంచామంటే కేంద్ర ప్రభుత్వం గ్యాస్, డీజల్ , పెట్రోల్ ధరలను పెంచి ప్రజలను అరిగోస పెడుతోందనిఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్‌ను సబ్సిడి పై రూ.400లకే ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పెద్ద పెద్ద మాటాలు మాట్లాడతాని దమ్ముంటే తెలంగాణలో రూ.400లకే సిలిండర్ ఇచ్చేలా సబ్సిడి కోసం ప్రత్యేక ప్యాకేజ్ ఇప్పించాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం పెద్దలకు తప్ప పేదలకు చేసింది ఏమి లేదని ధ్వజమెత్తారు. ప్రజా ఉద్యమాల ద్వారానే కేంద్ర ప్రభుత్వం దిగివస్తుందని, ఇందుకు సంఘంటితంగా నిరతరం ఉద్యమిస్తామన్నారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బిజెపికి రాజకీయం తప్ప ప్రజా సంక్షేమం పట్టదని విమర్శించారు.  5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రో ఉత్పత్తులు పెంచడం దారుణమన్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరతో వాటి ప్రభావం నిత్యావసర వస్తువులపై పడిందని, దీంతో పేదలు బతుకలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాతో గడిచిన రెండేళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంతో ధరలు పెంచడం దుర్మార్గమని, మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని దేశం నుంచి తరిమి కొడితే తప్ప బిజెపికి బుద్ది రాదన్నారు.

హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచి దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. 2014తో పొల్చికుంటే బిజిపి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ ధరలు ఆకాశ్నంటాయన్నారు. పెంచిన పెట్రో ఉత్పత్తులను ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం టిఆర్‌ఎస్ పార్టీ ఇంఛార్జీ తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పోరేటర్లు కొలన్ లక్ష్మి, మహేశ్వరి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్ నామన శేషు కుమారి, కిరణ్మయి, డివిజన్ అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీపతి, హన్మంతరావు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News