- Advertisement -
విమానం టేకాఫ్ అవుతుండగా అకస్మాత్తుగా దాని రెక్కల్లో మంటలు చెలరేగిన సంఘటనా జార్జిబుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్లే యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం టేకాఫ్ అవుతుండగా ప్రమాదం జరిగింది. వెంటనే సిబ్బంది అప్రమత్తమై విమానం అత్యవసర తలుపులు తెరవడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటకు వచ్చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు , ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని హ్యూస్టన్ ఫైర్ డిపార్ట్ మెంట్ తెలిపింది.ప్రమా సమయంలో విమానంలో మొత్తం 104 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వెంటనే ఎయిర్ పోర్టులోని అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పివేశాయి.
- Advertisement -