Sunday, December 22, 2024

గాజా తీర్మానంపై అమెరికా వీటో

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : తల్లడిల్లుతున్న గాజాలో వెంటనే కాల్పుల విరమణ అమలుకు ఐరాస చేసిన తీర్మానాన్ని అమెరికా అడ్డుకుంది. తనకున్న అసాధారణ వీటో ప్రయోగించి, దీనిని అడ్డుకుంది. పరస్పర దాడులతో సామాన్య పౌరుల జీవనక్రమానికి ఇబ్బంది ఏర్పడింది. దీనిని గుర్తించి అక్కడ మానవీయ సాయం అందించే విధంగా చేసేందుకు ఐరాస అక్కడ కాల్పుల విరమణ కొనసాగింపు దిశలో భద్రతా మండలి ప్రతిపాదించిన తీర్మానానికి ఆమోదం దక్కింది.

భద్రతా మండలిలో యుఎఇ ప్రతిపాదిత తీర్మానానికి 13 మంది అనుకూలంగా ఓటేశారు. బ్రిటన్ ఓటింగ్‌లో పాల్గొనలేదు. ముందుగా ముసాయిదాలోనే పలు లోపాలు ఉన్నాయని, ఇజ్రాయెల్‌పై తొలుత దాడులు చేసిన హమాస్ చర్యల గురించి ఖండించాల్సి ఉందని, తాము వీటోను వాడుకుంటున్నామని అమెరికా ప్రతినిధి తెలిపారు. దీనితో కాల్పుల విరమణ ప్రతిపాదనకు గండిపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News