Friday, December 20, 2024

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి అత్యున్నత పురస్కారం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర మంత్రి,రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అత్యున్నత పురస్కారం లభించింది. యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెన్షియల్ గోల్డ్ మెడలియన్ అవార్డును అందుకున్నారు. శనివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డికి అవార్డును యూఎస్ ప్రతినిధులు అందజేశారు.

పర్యాటక రంగాన్ని, సంస్కృతిని ప్రోత్సహించడంతో దేశఖ్యాతి యూఎస్ వరకే కాకుండా గ్లోబల్ వైడ్‌గా వ్యాపించిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారని ఆ దేశ ప్రతినిధులు వివరించారు. అంతేకాకుండా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలకు ఈ పురస్కారాన్ని అందించినట్లు స్పష్టంచేశారు. యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెన్షియల్ గోల్ మెడలియన్ అవార్డు అందుకున్న తొలి భారతీయ రాజకీయ నేతగా కిషన్ రెడ్డి నిలిచారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News