Thursday, January 23, 2025

హైదరాబాద్‌లో కార్యకలాపాలను ప్రారంభించిన యూనిటీ బ్యాంక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నూతన తరపు, డిజిటల్ ఫస్ట్ బ్యాంక్, యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ (యూనిటీ బ్యాంక్), ఈరోజు ఐదు కొత్త శాఖలను ప్రారంభించడంతో ముత్యాల నగరం – హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. నగరంలో పెరుగుతున్న వ్యాపార అవకాశాలపై ఆధారపడి యూనిటీ బ్యాంక్, ఖాతాదారులకు డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను యూనిటీ బ్యాంక్ అందిస్తుంది, ఎంఎస్ఎంఈలకు వ్యాపార రుణాలను అందజేస్తుంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు తెలివైన, వేగవంతమైన మరియు మరింత సౌకర్యవంతమైన బ్యాంక్‌తో బ్యాంకింగ్ చేయటానికి అవకాశం కల్పిస్తుంది.

నగరం లో తమ కార్యకలాపాలను విస్తృతంగా నిర్వహిస్తున్నామని గుర్తించేలా, యూనిటీ బ్యాంక్ ప్రస్తుతం దిల్‌సుఖ్‌నగర్, ఎస్ ఆర్ నగర్, మౌలాలీ, సుచిత్ర క్రాస్‌రోడ్, కూకట్‌పల్లి లో అత్యాధునిక శాఖలను ప్రారంభించింది. త్వరలో మరిన్ని శాఖలను ప్రారంభించనుంది.

యూనిటీ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఆకర్షణీయమైన వార్షిక వడ్డీ రేటు 9.50% * తో అందిస్తుంది, అయితే రిటైల్ పెట్టుబడిదారులు 9.00% వార్షిక వడ్డీ * సంపాదిస్తారు. సేవింగ్స్ ఖాతాల కోసం, రూ. 5 లక్షలు కంటే ఎక్కువ డిపాజిట్ నిల్వలపై యూనిటీ బ్యాంక్ 7.50% వడ్డీని అందిస్తుంది. రూ. 1 లక్ష మరియు రూ. 5 లక్షలు కంటే ఎక్కువ డిపాజిట్ల కోసం 7.25% వార్షిక వడ్డీ అందిస్తుంది. అదనంగా, ఎంపిక చేసిన శాఖలలో లాకర్లు సరసమైన ధరలకు కూడా అందుబాటులో ఉంటాయి.

యూనిటీ బ్యాంక్ లో ప్రత్యేకమైన అంశాలు:

ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9.50% వార్షిక వడ్డీ మరియు సేవింగ్స్ ఖాతాలపై 7.50% వార్షిక వడ్డీ అందిస్తుంది.

బ్రాంచ్ నెట్‌వర్క్: కస్టమర్‌లకు వ్యక్తిగతీకరించిన సహాయం మరియు మద్దతును అందించడానికి నగరం అంతటా అత్యాధునిక శాఖలు

లాకర్ సదుపాయం: ఎంపిక చేసిన శాఖలలో సరసమైన ధరలకు లాకర్లు అందుబాటులో ఉంటాయి.
వెల్త్ మేనేజ్‌మెంట్: బీమా, మ్యూచువల్ ఫండ్‌లు మరియు ఇతర ఆస్తి తరగతుల్లో పరిష్కారాలు.

యూనిటీ బ్యాంక్ ఎండి & సీఈఓ ఇందర్‌జిత్ కామోత్రా మాట్లాడుతూ “అభివృద్ధి చెందుతున్న టెక్ మరియు బిజినెస్ హబ్‌గా నగరం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్‌లో మా కార్యకలాపాలను విస్తరించడం యూనిటీ బ్యాంక్‌కి ఒక వ్యూహాత్మక చర్య, ‘సిటీ ఆఫ్ పెర్ల్స్’గా పేరుగాంచిన హైదరాబాద్ అరుదైన వజ్రాలు, పచ్చలు మరియు సహజ ముత్యాల వ్యాపారం కోసం అంతర్జాతీయ కేంద్రంగా నిలిచింది మరియు దాని ఔషధ , బయోటెక్నాలజీ సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందింది, హైదరాబాద్లో గణనీయమైన రీతిలో ఎంఎస్ఎంఈ మరియు HNI జనాభాను కలిగి ఉంది. యూనిటీ బ్యాంక్ ఈ డైనమిక్ ల్యాండ్‌స్కేప్‌లోకి ప్రవేశించాలని లక్ష్యంగా పెట్టుకుంది. .మా డిజిటల్-ఫస్ట్ విధానం హైదరాబాద్‌లోని టెక్-అవగాహన ఉన్న నగర వాసుల నడుమ ప్రతిధ్వనిస్తుందని, వారి ఆర్థిక వ్యవహారాలను సౌకర్యవంతంగా మరియు సురక్షితంగా నిర్వహించడానికి వీలు కల్పిస్తుందని మేము విశ్వసిస్తున్నాము” అని అన్నారు.

యూనిటీ బ్యాంక్ అనేది సెంట్రమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా ప్రమోట్ చేయబడిన షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్. ఇది రూ. 7,500 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్ల ను కలిగి ఉండటం తో పాటుగా రూ. 8,500 కోట్ల కంటే ఎక్కువ లోన్ బుక్, భారతదేశంలోని సుమారుగా 20 రాష్ట్రాలలో 400 బ్యాంకింగ్ అవుట్‌లెట్‌లు నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.

యూనిటీ బ్యాంక్, దాని సేవల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి www.theunitybank.comని సందర్శించండి

తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించడానికి కారణం

తెలంగాణలో 2.5 మిలియన్లకు పైగా ఎంఎస్ఎంఈ లు (సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు) ఉన్నాయి. ఈ ఎంఎస్ఎంఈ లు రాష్ట్రంలో ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తున్నాయి.

ఎంఎస్ఎంఈ లకు వ్యాపార రుణాలను అందించే యూనిటీ బ్యాంక్ యొక్క బిజినెస్ బ్యాంకింగ్ గ్రూప్ ఈ ప్రాంతంలో చక్కటి కార్యకలాపాలు కలిగి ఉంది. మేము సెక్యూర్డ్ మరియు అన్‌సెక్యూర్డ్ బిజినెస్ లోన్‌లను అందిస్తాము మరియు ఇయర్ ఆన్ ఇయర్ 88% పెరుగుదలతో రూ. 5,000+ కోట్లు పుస్తక పరిమాణం కలిగి ఉన్నాము. మొత్తం వ్యాపార బ్యాంకింగ్ పుస్తకంలో దక్షిణ భారతదేశం 40% (రూ. 2,000 కోట్లు) సమకూరుస్తోంది. ఆర్థిక సంవత్సరం 20 24లో మొత్తం బిబిజి అసెట్ బుక్‌లో 28% తెలంగాణ అందించింది.

మైక్రో ఫైనాన్స్‌ను అందించే యూనిటీ బ్యాంక్ ఇన్‌క్లూజివ్ బ్యాంకింగ్ (ఐబి) వ్యాపారం దక్షిణ భారతదేశంలో కూడా బలమైన పునాదిని నిర్మించుకుంది. జూన్ 24 నాటికి, దక్షిణ భారతదేశంలో మా లోన్ పోర్ట్‌ఫోలియో రూ. 410 కోట్లు, 1.5 లక్షల కంటే ఎక్కువ మంది కస్టమర్‌లకు సేవలు అందిస్తోంది. నాలుగు రాష్ట్రాలు (కర్ణాటక, కేరళ, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్) ఐబి పోర్ట్‌ఫోలియోలో 12.10% పైగా వాటా కలిగి ఉన్నాయి. ఈ వ్యాపారం 53 జిల్లాల్లో విస్తరించి ఉంది.

10 మిలియన్లకు పైగా కస్టమర్లకు సేవలను అందించటం మరియు రూ. 50,000 కోట్లకు మించి రుణ పుస్తకాన్ని నిర్మించడం లక్ష్యంగా బ్యాంక్ ఐదు సంవత్సరాల ప్రణాళికను రూపొందించింది, దీని పురోగతి లక్ష్యంలో ఇది భాగంగా ఉంది. లయబిలిటీ అక్క్విజిషన్ మరియు కాసా వృద్ధి కోసం మల్టీ -ఛానల్ విధానాన్ని అవలంబించడానికి ప్రసిద్ధ ఫిన్‌టెక్ సంస్థలతో భాగస్వామ్యాలు కూడా జరుగుతున్నాయి. అవి వృద్ధిని వేగవంతం చేయనున్నాయి. యూనిటీ బ్యాంక్ టెక్నాలజీలో పెట్టుబడులను పెంచడానికి కట్టుబడి ఉంది మరియు ఈ సంవత్సరంలో మరిన్ని డిజిటల్ ఆఫర్‌లను అందుబాటులోకి తీసుకురానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News