Monday, December 23, 2024

పబ్లిక్ గార్డెన్స్‌లో సమైక్యతా దినోత్సవం

- Advertisement -
- Advertisement -

పాల్గొననున్న సిఎం కెసిఆర్
జెండా ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి

మన తెలంగాణ/ హైదరాబాద్ : హైదరాబాద్ స్టేట్ భారత యూనియన్‌లో కలిసిన సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదే విధంగా నగరంలోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహించే వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. జిల్లా కేంద్రాల్లో కూడా అదే రోజు ఉదయం 9 గంటలకు ఈ వేడుకల్లో జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రభుత్వ చీఫ్ విప్‌లు, విప్‌లు జాతీయ జెండాలను ఎగురవేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
జిల్లా వారీగా వివరాలు :
ఆదిలాబాద్‌లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, భద్రాద్రి కొత్తగూడెంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్ , భూపాలపల్లిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జనగామలోమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జోగులాంబగద్వాలలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు , కామారెడ్డిలో స్పీకర్ పరిగి శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్, కొమరంభీం ఆసిఫాబాద్‌లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ సుంకరి రాజు, మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్,మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాథోడ్,మంచిర్యాలలో ప్రభుత్వ విప్ బాల్కసుమన్, మెదక్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి, ములుగులో ప్రభుత్వ విప్ ప్రభాకర్‌రావు, నాగర్‌కర్నూల్‌లో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, నల్లగొండలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నారాయణ్‌పేటలో ఉమెన్స్ కమిషన్ చైర్మన్ వాకాటి సునీతా లకా్ష్మరెడ్డి, నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, నిజామాబాద్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, పెద్దపల్లిలో ప్రభుత్వ చీప్ విప్ టి. భానుప్రసాద్‌రావు, రాజన్న సిరిసిల్లలో మంత్రి కె.తారక రామారావు, రంగారెడ్డిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సంగారెడ్డిలో హోంమంత్రి మహమూద్ అలీ, సిద్దిపేటలో మంత్రి తన్నీర్ హరీశ్‌రావు, సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి, వికారాబాద్‌లో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, వనపర్తిలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, హన్మకొండలో ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, వరంగల్‌లో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, యాద్రాద్రి భువనగిరిలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డిలు ఆయా జిల్లాల్లో జెండాలు ఎగురవేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News