Monday, December 23, 2024

సెప్టెంబర్ 17న సమైక్యతా దినోత్సవం

- Advertisement -
- Advertisement -

సంబురం చేద్దాం

రాష్ట్రవ్యాప్తంగా బిఆర్‌ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాలి

మనతెలంగాణ/హైదరాబాద్:   రాష్ట్రం,  భారత సమాఖ్యలో విలీనమైన సెప్టెంబర్ 17వ తేదీని జాతీయ సమైక్యత దినోత్సవంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు జరుపుకుంటున్నారని, ఆ రోజును ఘనంగా ఎక్కడికి అక్కడ సంబరంగా నిర్వహించుకోవాలని పార్టీ శ్రేణులకు భార త రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా హై దరాబాద్ నగరంలో ఈ వేడుకలో పాల్గొంటారని, దీంతోపాటు ప్రభుత్వమే పెద్ద ఎత్తున ప్రతి జిల్లా కేంద్రాలలో నిర్వహించే సంబరాలకు మంత్రులు పాల్గొని జాతీయ జెండాను ఎగరవేస్తారని తెలిపా రు. అదేవిధంగా భారత రాష్ట్ర సమితి పార్టీ శ్రేణు లు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ జాతీయ సమైక్య తా దినోత్సవాల్లో పాల్గొనాలని మంత్రి కెటిఆర్ కో రారు.
అభివృద్ధిలో అగ్రగామిగా తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పది సంవత్సరాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జో డెద్దులుగా తీసుకువెళుతూ దేశానికే ఆదర్శంగా ని లిచేలా వినూత్నమైన కార్యక్రమాలతో రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిందని కెటిఆర్ అన్నా రు. అయితే తెలంగాణ అభివృద్ధి పట్ల ఓర్వలేని రాజకీయ పార్టీలు ప్రతి అంశాన్ని రాజకీయం చేసే దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజలు సంబరంగా జరుపుకునే జాతీ య సమైక్యత దినోత్సవంపై కూడా కొన్ని పార్టీలు రాజకీయాలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డా రు. ప్రతి అంశానికి మతాన్ని జోడించి సమాజంలో చిచ్చుపెట్టే విచ్ఛిన్నకర శక్తుల కుట్రలను ప్రజలు గమనించి జాగ్రత్తగా ఉండాలని కోరారు.
మహోజ్వల సందర్భం అందరికీ గుర్తుంటుంది
1948 సెప్టెంబర్ 17న సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన రోజు అని, రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిన రోజు అని కెటిఆర్ వ్యాఖ్యానించారు. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక స్వే చ్ఛ వైపు పరివర్తన చెందడానికి యావత్ తెలంగా ణ సమాజం అద్భుతంగా కృషి చేసిన మహోజ్వల సందర్భం అందరికీ గుర్తుంటుందని పేర్కొన్నారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి, తమ సంకుచి త స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే ఎత్తుగడలకు విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతున్నాయన్నారు. ఆనాటి చరిత్రతో, పరిణామాలతో సంబంధమే లేని అవకాశవాదులు చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయని విమర్శించారు. అత్యంత మేధో సంపత్తితో, క్రియాశీలతతో చురుకుగా స్పందించే తెలంగాణ సమాజం.. అదే చైతన్యాన్ని ప్రదర్శించి.. తెలంగాణ జీవనాడిని కలుషితం చెయ్యాలని చూస్తున్న విచ్ఛిన్నకర శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News