Tuesday, January 21, 2025

విద్యార్థులకు యూనివర్శిటీ అండగా ఉంటుంది: విసి రవీందర్‌ యాదవ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పాము కాటుకు గురై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓయూ విద్యార్థి విష్ణును ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవీందర్‌ యాదవ్ పరామర్శించారు. గురువారం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ, చీఫ్ వార్డెన్ డాక్టర్ కొర్రెముల శ్రీనివాస్ తో కలిసి ఆసుపత్రికి వెళ్లిన విష్ణు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

విద్యార్థులకు యూనివర్శిటీ అండగా ఉంటుందని చికిత్స పొందుతున్న విద్యార్థికి భరోసా ఇచ్చారు. విష్ణు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారని తెలిపారు. వర్షాలు పడుతున్నందున విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హాస్టళ్లు, మెస్‌ల పరిసరాలను శుభ్రం చేయాలని చీఫ్ వార్డెన్‌ను ఆదేశించారు. విసి ఆదేశాలతో చీఫ్ వార్డెన్ డాక్టర్ కొర్రెముల శ్రీనివాస్ ఆయా హాస్టళ్లు, మెస్‌ల కేర్ టేకర్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైన చోట్ల అదనంగా విద్యుత్తు దీపాలు అమర్చుకోవాలని సూచించారు. హాస్టళ్లు, మెస్ ల చుట్టూ పరిశభ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News