Monday, January 20, 2025

శ్రీఅండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/యాదాద్రి : శ్రీ లక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రంలో అండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవ పూజలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం శ్రీవారి బ్రహ్మోత్సవాలతోపాటు అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో సాయంత్రం ఆలయ మండపములో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊంజల్ సేవ మహోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు.అమ్మవారికి ప్రత్యేక అలంకరణ గావించిన అర్చకులు మేళతాళములతో మంత్రోచ్చరణ గావిస్తూ అమ్మవారి సేవను ఆలయ పూరివీదులలో ఊరేగించగా భక్తజనులు అమ్మవారిని దర్శించుకున్నారు. అద్దాల మండపములో అమ్మవారి సేవను వేచింప చేసి ఊంజల్ సేవ ప్రత్యేకతను తెలిపారు.శ్రీలక్ష్మీనరసింహ స్వామి దర్శించుకున్న భక్త జనులు ఆలయంలో జరుగు నిత్యపూజలో పాల్గొన్నారు.

శ్రీవారి నిత్యరాబడి..

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిత్యరాబడిలో భాగంగా శుక్రవారం రోజున 14,11,264 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

శ్రీలక్ష్మీనరసింహుని దర్శించుకున్న ప్రముఖులు…

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారిని మాజి మంత్రి,ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వయంబుదేవుడి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించిన ఆయనకు ఆలయ అర్చకులు ఆశీర్వచనము చేసి తీర్ధ ప్రసాదములు అందచేశారు.

జిల్లా జడ్జి…

శ్రీలక్ష్మీనరసింహుని యాదాద్రి భువనగిరి జిల్లా జడ్జి బాల భాస్కర్ దర్శించుకున్నారు. శ్రీ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన ఆయనకు ఆలయ అర్చకులు ఆశీర్వచనము,తర్ధ ప్రసాదములు అందచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News