Monday, December 23, 2024

హైదరాబాద్ లో దారుణం.. యుకుడిపై కత్తులతో దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. కుతుబ్బుద్దీన్ అనే యువకుడిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు..కత్తులతో దాడి చేశారు. కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి పారిపోయారు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడిని స్థానికులు మెహిది పట్నం నాలా నగర్ లోని ఆలివ్ ఆసుపత్రికి తరలించారు. యువకుడిపై దాడి చేసి పారిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News