Monday, April 7, 2025

హైదరాబాద్‌లో ఎస్ఐని కత్తితో పొడిచి…

- Advertisement -
- Advertisement -

Unknown persons attack on SI

హైదరాబాద్: ఎస్‌ఐపై దుండగులు కత్తితో దాడి చేసిన సంఘటన హైదరాబాద్‌లోని మారేడుపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎస్‌ఐ వినయ్ కుమార్ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. బైక్‌పై వస్తున్న ఇద్దరిని ఎస్‌ఐ ఆపాడు. వారిని ఎక్కడ నుంచి వస్తున్నారని ప్రశ్నించడంతో కత్తి తీసుకొని ఎస్‌ఐ కడుపులో పొడిచారు. తీవ్రంగా గాయపడిన ఎస్‌ఐని స్థానిక ఆస్పత్రికి తరలించారు. దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఎస్‌ఐ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిసి టివి ఫుటేజీల ఆధారంగా వారిని గుర్తిస్తామని పోలీసులు వెల్లడించారు. గతంలో సైబరాబాద్ కమిషనర్ రేట్ పరదిలో ఇద్దరు కానిస్టేబుళ్లపై దుండగులు కత్తులతో దాడి చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News