Wednesday, January 22, 2025

పటాన్ చెరులో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దురు మృతి

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియన ఓ వాహనం, కారును ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఆదివారం తెల్లవారజామున మండంలోని కర్థనూరులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం హైటెక్ సిటీ యశోద ఆస్పత్రికి తరలించారు.

మృతులు నల్గొండ జిల్లాకు చెందిన లుమాన్ అలీ, వాజిద్ అలీగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాద ఘటనపై బిడిఎల్ బానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News