Monday, April 14, 2025

పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు అన్నదమ్ములు మృతి

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందిన దారుణ ఘటన జిల్లాలోని మంథనిలోని కూచిరాజ్ పల్లి సమీపంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిని మంథనికి చెందిన నాగరాజు, నవీన్ అనే ఇద్దరు అన్నదమ్ములుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News