Saturday, December 21, 2024

గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యం

- Advertisement -
- Advertisement -

బిజినేపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని మమ్మాయిపల్లి గ్రామ శివారులోని బిటి రోడ్డు పక్కన గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. గురువారం ఉదయం స్థానికులు రోడ్డు పక్కనే ఉన్న మతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. మృతి చెందిన మహిళ వయసు 42 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం నాగర్‌కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించారు.

Also Read: తలకొండపల్లిలో సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News