Saturday, February 15, 2025

భార్య కోసం వెతికి ఆసుపత్రిలో చేరిన భర్త..తీరా చూస్తే పక్క బెడ్ పైనే ఆమె

- Advertisement -
- Advertisement -

తప్పిపోయిన భార్య కోసం వెతికి వెతికి భర్తకు కంటిచూపు మందగించడంతో ఆసుపత్రిలో చేరి కంటిశుక్లం ఆపరేషన్ చేయించుకున్నాడు. తీరా అతను కళ్లు తెరిచి చూచే సరికి పక్క బెడ్ పైనే భార్య కనిపించిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. కేవతా తలాబ్ బస్తీకి చెందిన రాజేష్ కుమార్ భార్య జనవరి 13నుంచి కనిపించకుండా పోయింది. భార్య కోసం ఎంతగానో వెతికిన ఆమె ఆచూకి తెలియకపోవడంతో చివరికి రాజేష్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

ఇదే సమయంలో రాజేష్ కంటిచూపు మందగించడంతో ఉన్నావ్ ప్రభుత్వాసుపత్రిలో ఫబ్రవరి 6న కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. చికిత్స అనంతనరం రాజేష్ కళ్లకు ఉన్న కట్టును తొలగిస్తుండగా పక్క బెడ్ పైన అతని భార్య గొంతు వినిపించింది. వెంటనే రాజేష్ తన భార్య దగ్గరికి వెళ్లి మాట్లాడగా ఆమె సమాధానం చెప్పలేని స్థితిలో కనిపించింది. తలకు బలమైన గాయం తగలడంతో ఎవరో ఆమెను ఆసుపత్రిలో చేర్పించినట్లు వైద్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News