- Advertisement -
నారాయణఖేడ్ మండల కేంద్రమైన కంగ్టిలో మన ఊరు మన డాక్టర్ ప్రత్యేక కార్యక్రమాన్ని పాత గ్రామ పంచాయతీ ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసి చిన్న పిల్లలకు డాక్టర్ గిరిజ ఉచితంగా వైద్య సేవలను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ చిన్న పిల్లలను శిబిరానికి తీసుకొచ్చి వైద్యచికిత్సలను చేయించడం జరిగింది. దీర్ఘ, స్వల్ప కాలిక వైద్యం పట్ల డాక్టర్ తగు సలహాలు, సూచనలు అందజేసి మందులు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చంద్రారెడ్డి, చన్నబసప్ప, లొండె నర్సింలు, మొగులప్ప, సిబ్బంది లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -