Thursday, January 23, 2025

గుంతలు కనపడవా!

- Advertisement -
- Advertisement -

మల్దకల్ : మండల కేంద్రంలోని దేవాలయానికి వెళ్లే రోడ్డు గ్యాస్ గోదాం ఎదురుగుండా గుంతలమయంగా మారింది. కనీసం అక్కడ గుంతలకు మట్టి వేసి పుడ్చాలన్న ఆలోచనలు కూడా పంచాయతీ అధికారులకు లేనట్టే కనిపిస్తుంది. కొన్ని నెలలుగా ఇక్కడ గుంతలు ఏర్పడ్డా చూసీ చూడనట్లే అధికారులు వ్యవహరిస్తున్నారు. వర్షం వచ్చిందంటే ఆ గుంతలు నిండా వర్షం నీళ్లు నిండిపోవటంతో ఆ గుంతలను గుర్తించలేక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రతి రోజు అధికారులు ఈ రోడ్డు వెంబడి వెళ్తుంటారు కానీ వారికి గుంతలు కనపడవా అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గమనించి గుంతలను పూడ్చి ప్రమాదాలు జరగకుండా నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News