Tuesday, November 5, 2024

అకాల వర్షాలతో ఆగమాగం

- Advertisement -
- Advertisement -

ఉపరితల ద్రోణి.. మూడు రోజులు వర్షాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వాతావరణ పరిస్థితు లు వ్యవసాయరంగాన్ని కష్టాలపాలు చేస్తున్నా యి. యాసంగి పంటలు చేతికందుతున్న వేల ఉన్నట్టుండి కురుస్తున్న అకాల వర్షాలకు పైరు మీదే పంటలు నష్టపోవాల్సివస్తోది. గాలీవానతోపాటు వడగండ్ల వానలు పండ్లతోటల రైతుల ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. శనివారం నాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది.మెదక్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం రాశులు కూడా తడిసిపోయా యి. ఈదురుగాలులు ,ఉరుములు మెరుపుల తో కురిసిన వర్షం ధాటికి కోతకు వచ్చిన పంటలు నేలకొరిగాయి. పలు జిల్లాల్లో గాలి వాన ధాటికి మామిడి తోటలకు నష్టం వాటిల్లింది.తోటల్లో చెట్లపై కాపుమీద ఉన్నకాయలు జలజల నేలరాలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేత కాయలు సైతం రాలిపోయా యి.

ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపధ్యంలో కాతా పూత లేక పంట దిగుబడి తగ్గిపోయింది. మార్కెట్‌లోమామిడికి మంచి ధర ఉండడంతో కనీసం తోటల సాగు పై పెట్టుబడి ఖర్చులైనా వస్తాయని ఆశిస్తుండ గా అకాల వర్షాలు మామిడి రైతుల ఆశలను నీరుగారుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వరిపైర్లకు నష్టం వాటిల్లింది. ధాన్యపు రాశులు సైతం తడిసిపోయాయి. కామారెడ్డి జిల్లాలో కూడా వడగండ్ల వాన కురిసింది. రంగారెడ్డి, మేడ్చెల్ జి ల్లాల పరిధిలోనూ వర్షాలు కారణంగా పంటలు నష్టపోయారు. అకాలవర్షాల కారణంగా జరిగిన రెవెన్యూ, వ్యవసాయ శాఖ సిబ్బంది ప్రభుత్వానికి నివేదికలు పంపేందుకు ఉమ్మడి సర్వేలు నిర్వహిస్తున్నారు.

రెండు రోజులు అప్రమత్తం

అకాల వర్షాల బారిన పడకుండా మరో రెండు రోజులపాటు రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు రైతులను హెచ్చరిస్తున్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మరి మూడు రోజుల పాటు అకాల వర్షాలు, వానలు కురి సే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉపరితల ఆవర్తన ద్రోణి విదర్భ ప్రాంతం నుంచి మరట్వాడ ఉత్తర ఇంపీరియల్ కర్ణాటక వరకూ స ముద్ర మట్టానికి 900మీటర్ల ఎత్తు వద్ద స్థిరం గా కొనసాతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రభావంతో ఆదివారం నుంచి మ రో రెండు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాం తాల్లో అక్కడక్కడ తేలిపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News