Sunday, December 22, 2024

ఐపీఎల్ వేలంలో అన్ సోల్డ్ గా మిగిలిపోయిన టాప్ బ్యాటర్లు

- Advertisement -
- Advertisement -

ఐపీఎల్ మినీ వేలం జోరుగా సాగుతోంది. ఊహించని విధంగా కొందరు క్రికెటర్లకు భారీ ధర పలికింది. టాప్ ప్లేయర్లని భావించిన కొందరు అన్ సోల్డ్ గా మిగిలిపోవడం విశేషం. ఆస్ట్రేలియా టాప్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అన్ సోల్డ్ గా మిగిలిపోవడం గమనార్హం. రెండు కోట్లతో వచ్చిన స్మిత్ ను కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. దక్షిణాఫ్రికా ఆటగాడు రిలీ రొసోవ్ ను కూడా ఎవరూ కొనలేదు. రెండు కోట్ల ధరతో బరిలోకి దిగిన రొసోవ్ అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు.

ఇంగ్లండ్ ఆటగాడు, 24 ఏళ్ల హ్యారీ బ్రూక్ కు భారీ ధర పలికింది. నాలుగు కోట్ల రూపాయలు చెల్లించి ఢిల్లీ కాపిటల్స్ దక్కించుకుంది. బ్రూక్ కోసం రాజస్థాన్ రాయల్స్ కూడా పోటీ పడింది. కానీ చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ పంతం నెగ్గింది.

మరో ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్ ను సన్ రైజర్స్ జట్టు దక్కించుకుంది. రెండు కోట్లతో బరిలో నిలిచిన ట్రావిస్ హెడ్ ను 6.80 కోట్లు చెల్లించి, సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. ట్రావిస్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ చివరవరకూ గట్టిగా ప్రయత్నించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News