- Advertisement -
నంగునూరు : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని, ఘనాపూర్ గ్రామాల్లో మంగళవారం సాయంత్రం అకాల వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఘనాపూర్ గ్రామంలో వడగండ్ల వానకు చేతికొచ్చిన వరి, మొక్కజొన్న, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. గాలి వానకు చెట్లు నేలకొరిగాయి. నంగునూరు గ్రామంలో వరి, మొక్కజొన్నతో పాటు మామిడి కాయలు నేలరాలాయి. గాలి వాన బీభత్సానికి నంగునూరు రైతువేదిక పైకప్పు రేకులు లేచిపోయాయి. ఈ విషయమై రెవెన్యూ, వ్యవసాయ అధికారులను వివరణ కోరగా బుధవారం రోజున క్షేత్రస్థాయిలో పంట నష్టం వివరాలను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని తెలిపారు.
- Advertisement -