Wednesday, January 22, 2025

అకాల వర్షం.. అపార నష్టం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో ని పలు జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు ప డ్డాయి. అకాల వర్షాలతో రైతులకు అపార న ష్టం వాటిల్లింది. నిర్మల్ జిల్లా, కుంటాల మం డలంలోని కల్లూరు, అందకూర్, ఓలా తదిత ర గ్రామాల్లో ఈదురుగాలుల బీభత్సంతో పూ ర్తిగా పంటలు నేలకొరగడంతో రైతులకు అ పార నష్టం వాటిల్లింది. జొన్న పంటతో పాటు మొక్కజొన్న పంట తడిసి ముద్దవడంతో అ న్నదాత లు లబోదిబోమంటున్నారు. గాలివాన బీభత్సానికి ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

ట్రాన్స్‌ఫార్మర్లు కూలిపోవడంతో గ్రామాల్లో వి ద్యుత్ స రఫరాలో అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా వరంగల్ రూరల్ జిల్లా, హసన్ పర్తి మండల వ్యాప్తంగా కురిసిన వర్షాలతో వరి, మొ క్కజొన్న, రైతులు అకాల వర్షానికి నష్ట పోయారు. అకాల వర్షాల వల్ల చేతి కొ చ్చిన పంట పొలాల్లోనే నీళ్ల పాలైందని రైతు లు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు పంట కోసం కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే వర్షా నికి ధా న్యం తడిసి ముద్దయిందని రైతులు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News