Wednesday, January 22, 2025

తమిళనాడులో అకాల వర్షాలు..11 మంది మృతి

- Advertisement -
- Advertisement -

తమిళనాడులో ఈనెల 16 నుంచి 20 వరకు అకాల వర్షాల కారణంగా 11 మంది మరణించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కన్నియాకుమారి, కోయంబత్తూరు, తిరునల్వేలి, నీలగిరి జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది.వర్షప్రభావిత జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికను సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా 296 మందితో పది విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో 12 పశువులు చనిపోగా, 24 గుడిసెలు , ఇళ్లు దెబ్బతిన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News