Thursday, January 23, 2025

మాట తప్పని నాయకులం మడమ తిప్పం

- Advertisement -
- Advertisement -

పెద్దవూర: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేస్తుందని మాట తప్పి, మడమతిప్పి నాయకులను కాదని మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. కుందూరు జానారెడ్డి తనయుడు జయవీరారెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గిరిజన చైతన్య యాత్రలో శుక్రవారం పాల్గొన్ని మాట్లాడుతూ నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ప్రతి అభివృద్ధి నా హయాంలోనిఏ జరిగిందని ప్రతితండాకి రోడ్లు, విద్యుత్, సిసి రోడ్లు తాగునీటి వసతి కల్పించిన ఘనత నాదేనని అన్నారు. అలాగే బిఆర్‌ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఎక్కడా లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చుతుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుపేదలు ఇండ్ల నిర్మాణానికి ఐదులక్షల రూపాయలు ఇస్తామని, అలాగే ఏక కాలంలో రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాపీ,వంటగ్యాస్ ధర 500 రూపాయలకే ఆడపడుచులకు బస్సులో ప్రయాణం ఉచితం చేస్తామని, హామీ ఇచ్చారు. నేను చేసిన ప్రతి అభివృద్ధి ఇక్కడున్న నాయకులకు ప్రజలకు తెలుసు అన్నారు. అధికార పార్టీ నాయకులు అభివృద్ధి పేరుతో దోచుకోవడం తప్పిస్తే అభివృద్ధి చేసేందేమీ లేదని విమర్శించారు. అలాగే తనయుడు మొదలుపెట్టిన గిరిజన చైతన్య యాత్ర జనసంద్రంతో ముందుకు సాగుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మూడవ రోజు పాదయాత్ర నీమా నాయక్ తండ నుంచి ప్రారంభై మల్లెవానికుంట తండా, గోపాల్ తండా, పూల్యాతండా, పూరబావి తండా, బెట్టెల్ తండా మీదుగా సాగి కుంకుడు చెట్టు తండాలో ముగిసింది.

మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బాలునాయక్, వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, స్థానిక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి గౌని రాజా, రమేష్, కుందూరు వెంకటరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పబ్బు యాదగిరిగౌడ్, యూత్ లీడర్ గడ్డంపల్లి వినయ్‌రెడ్డి, తొడిమ సుధాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, హనుమంతరెడ్డి, పగడాల నాగరాజు, దుగ్యాల శంకర్, కిలారి మురళి, రవీందర్‌రెడ్డి, బైకానీ లక్ష్మ య్య, సీతారాంనాయక్, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎస్‌ఎస్‌యు ఐ నాయకులు అనేక మంది గిరిజన మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News