Friday, December 20, 2024

ఉపాధి కోసం తెలంగాణకు యూపీ, బీహార్‌ కూలీలు

- Advertisement -
- Advertisement -

మోస్రా: వర్షాకాలంలో ఉపాధి కోసం యూపి, బీహార్‌కు రాష్ట్రాలకు చెందిన మగ కూలీలు తెలంగాణ బాట పట్టారు. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాలలో యూపి, బీహార్‌కు చెందిన మగ కూలీలు ఎకరాలకు ఎకరాలు గుత్తగా మాట్లాడుకొని వరినాట్లు వేస్తుండటంతో జోరుగా వ్యవసాయం ఊపందుకుంది. అయితే మగ కూలీలు వరినాట్లు వేయటం ఏంటని గ్రామాలలోని రైతులు ఆశ్చ ర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో గతంలో గ్రామాలలో మహిళలు మాత్రమే వరి నాట్లు వేసేవారు కానీ దీనికి భిన్నంగా యూపీ, బీహార్ రాష్ట్రానికి చెందిన మగ కూలీలు వరి నాట్లు వేయటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఈవరి నాట్ల వేసే యువకుల వయసు 25 సం వత్సరాల నుండి 30 సంవత్సరాలలోపు ఉండడం గమనార్ధం. ఈ యువకులంతా ఒక్క ఎకరం పొలానికి గుత్తగా రూ. 3500 నుండి రూ. 4000 రూపాయల వరకు తీసుకొని వరినాట్లు వేస్తున్నట్లు బీహార్, యూపీ, రాష్ట్రానికి చెందిన యువకులు తెలియజేశారు. వర్షాకాలంలో తెలంగాణలో కూలీలకు బాగా డిమాండ్ ఉంటుందని తమ సొంత రాష్ట్రాల్లో ఉపాధి లేక ఇక్కడకు వచ్చి కూలీ పనులు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇదిలా ఉండగా బీహార్, యూపీ రాష్ట్రానికి చెందిన యువకులు వరినాట్లు వేయటానికి రావటంతో గ్రామాలలోని మహిళలకు ఉపాధి దొరకడం కష్టంగా మారిందని మహిళా కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News