లక్నో : గత ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం అన్ని ముఖ్యమైన లక్షాలను నెరవేర్చిందని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. గురువారం విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూఏ బీజేపీ ప్రభుత్వ పాలనా కాలంలో మతపరమైన హింసాత్మక సంఘటనలు, ఉగ్రవాద దాడులు జరగలేదన్నారు. పెట్టుబడిదారులకు ప్రధాన ఎంపికగా తమ రాష్ట్రాన్ని నిలిపామని, ఈజ్‌ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తన నేతృత్వంలో ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌ను 14 నుంచి రెండోస్థానానికి తీసుకెళ్లిందన్నారు. టెక్నికల్, ఇతర రంగాల వారీగా బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల ద్వారా మాత్రమే ఇది సాధ్యమైందన్నారు. తన కృషి వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దేశంలో రెండో స్థానానికి చేరిందని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత తలసరి ఆదాయం సంవత్సరానికి రూ. 47,000 ఉండేదని, ఇప్పుడు దీన్ని రూ. 54,000 కు తీసుకెళ్లినట్టు తెలిపారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ. 6 లక్షల కోట్లకు పెంచామన్నారు. కొవిడ్ సంక్షోభాన్ని తమ ప్రభుత్వం దీటుగా ఎదుర్కొందని, ప్రతి వయోజన వ్యక్తి కొవిడ్ టీకా మొదటి డోసు తీసుకున్నారని, సుమారు 70 శాతం మంది అర్హులు రెండు డోసులు తీసుకున్నారని చెప్పారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో తమ రాష్ట్రాన్ని దేశానికి ఓ ఉదాహరణగా నిలిపామని తెలిపారు.
ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను నెం.2 స్థానంలో నిలిపాం: యోగి ఆదిత్యనాథ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -